ఫిట్‌నెస్ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనుకూడా జిమ్‌లో జాయిన్ అవుతా.. అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో సిబ్బందికి సూచన చేస్తూ పోస్టు చేశారు.
2026 ప్రణాళికను ఎక్స్‌లో పోస్టు చేసిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: పోలీసులు ఉద్యోగ విధులను, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకోవాలని, ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్(Hyderabad Police Commissioner V.C. Sajjanar) పేర్కొన్నారు. ఈ మేరకు 2026 సంవత్సరంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను, నేరనియంత్రణకు సిద్ధం చేసిన ప్రణాళికలను ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.
‘చాలాకాలంగా ఫిట్‌నెస్ కోసం (వ్యాయామం) జిమ్‌కు వెళ్లాలని అనుకున్నాను. కానీ పని ఒత్తిడి వల్ల కుదరలేదు.. ఇకపై ఆరోగ్యం విషయంలో రాజీపడేదిలేదు. త్వరలోనే జిమ్‌లో చేరుతా..’ అని సీపీ సజ్జనార్ ప్రకటించారు. పుస్తక పఠనానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని, అన్నింటికంటే ముఖ్యంగా.. కుటుంబ సభ్యులు, మిత్రులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
